2 September, 2026 | 10:39 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

జానమ్.. ఎటు వైపు పయనం?

13-07-2024 | 04:38am

త్రిప్తి డిమ్రి.. ‘యానిమల్’ తర్వాత దేశ మంతా మార్మోగిన పేరు. ఆ సినిమాలో ఈ భామ స్క్రీన్‌పై కనిపించింది తక్కువ సమయమే అయినా అసలు హీరోయిన్ రష్మిక మందన్న కన్నా ఎక్కువ పాపులర్ అయి పోయింది. అయితే, క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నమైతే సుస్పష్టం చేస్తోంది ఈ భామ తీరు. వరుస అవకాశాలతో గ్లామర్ తారగా ఆకట్టుకునేందుకు ఉబలాట పడుతోంది. అందాల ఆరబో త శ్రుతి మించుతుండటంతో ప్రస్తుతం విమర్శల పాలవుతోందీ బ్యూటీ. ఇంకా వివరంగా చెప్పాలంటే.. విక్కీ కౌశల్ హీరోగా కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘బ్యాడ్ న్యూజ్’లో త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తోంది.

‘భూల్ భూలయ్యా ‘విక్కీ విద్యా కా వో వాలా వీడి యో’, ‘ధడక్ లాంటి క్రేజీ చిత్రాల్లోనూ ఈ భామ నటిస్తోం ది. ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’ నుంచి విడుదలైన ‘జానమ్’ అనే పాట బాలీవుడ్ మోస్ట్ హాట్ సాంగ్స్‌లో ఇది కూడా చేరి పోతుందంటున్నారు. ఎందుకంటే ఈ పాటలో విక్కీ కౌశ ల్ డిమ్రి మధ్య ఘాటైన రొమాన్స్ సోషల్ మీడి యాను వేడెక్కిస్తోంది. త్రిప్తి డిమ్రి ఇచ్చిన ఎక్స్‌పోజిం గ్‌తో ఫాలోవర్స్‌గా మారిపోయిన యువతే ఇప్పు డు ఆమె బోల్డ్‌గా కనిపిస్తుండటంపై ట్రోల్స్ చేస్తోంది. మరి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్న త్రిప్తి వెలుగుల దారిలోనే పయనిస్తుం దా? మళ్లీ అంధకారం వైపు సాగుతుందా.. అనేదే ప్రస్తు తం అందరిలో ఉన్న డౌటనుమానం!