2 September, 2026 | 11:28 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

కొన్ని ప్రేమ కథలు వెంటాడుతాయ్

13-07-2024 | 04:36am

అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నటిస్తున్న తాజా చిత్రంలో సంతోష్ శోభ న్ హీరోగా నటించనున్నారు. సంతోష్ శోభన్‌కు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలుపుతూ శుక్రవారం మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ ఆసక్తికరంగా ఉం ది. ‘కొన్ని ప్రేమ కథలు జీవిత కాలం వెంటాడుతాయి’ అంటూ దానిపై క్యాప్షన్ రాసి ఉంది. సుమన్ పాతూరి దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సహకారం సాయి రాజేశ్ అందిస్తూ ఎస్‌కేఎన్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతుండగా, ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు మూవీ టీమ్ సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్; డీవోపీ: అస్కర్. 

చెన్నై బ్యాక్‌డ్రాప్ ప్రేమకథతో.. 

సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెఫ్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో సంతోష్ శోభన్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి గ్లింప్స్‌ను, టైటిల్ లుక్‌ను విడుదల చేశారు. టైటిల్ లుక్‌లో చెన్నై సెంట్రల్ స్టేషన్ సమీపంలోని ఓ రెసిడెన్షియల్ ఏరియాను చూపించారు. చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా ప్రేమికుల దినోత్సవ కానుకగా 2025 ఫిబ్రవరి 14న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఆదిత్య రవీంద్రన్; సినిమాటోగ్రఫీ: దినేశ్ పురుషోత్తమన్. కో ప్రొడ్యూసర్: అజయ్ కుమార్ పి.