జపాన్ మ్యాచ్ డ్రా
ఆర్లింగ్టన్, జూన్ 15: ఫిఫా వరల్డ్‌కప్‌లో జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ సాకర్ అభిమానులను ఉర్రూతలూగించింది. తొలి అర్ధభా గంలో ఇరుజట్లు అసలు ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయాయి. అయితే రెండో భాగంలోనే ఇరు జట్లు కలిసి ఏకంగా నాలుగు గోల్స్ కొట్టాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో తొలి 14 నిమిషాల్లోనే మూడు గోల్స్ కొట్టటడంతో డాలస్ స్టేడియం హోరెత్తిపోయింది.
నెదర్లాండ్స్ ఆటగాడు వాన్ వాన్ డైక్ 50వ నిమిషంలో తొలి గోల్ చేయగా.. తర్వాత 57వ నిమిషంలో జపాన్ ప్లేయర్ నకముర కూడా గోల్ కొట్టి స్కోర్ సమం చేశాడు.మరో ఏడు నిమిషాల్లోనే నెదర్లాండ్స్ ప్లేయర్ క్రైసెన్సియో సమ్మర్విల్లే 64వ నిమిషంలో గోల్ చేసాడు. దీంతో నెదర్లాండ్స్ గెలుపు ఖాయమనుకున్నారు. చివరి నిమిషాల్లో కోకి ఒగావా తలతో అద్భుతమైన గోల్ చేయడంతో మ్యాచ్ 2 డ్రాగా ముగిసింది.






