16 June, 2026 | 2:38 AM

రంగారెడ్డి రైజర్స్ కెప్టె న్‌గా తనయ్ త్యాగరాజన్

16-06-2026 12:00 AM

హైదరాబాద్, జూన్ 15: టీజీ20 లీగ్ తొలి సీజన్ కోసం ప్రణవ రంగారెడ్డి రైజర్స్ తమ కెప్టెన్‌గా తనయ్ త్యాగరాజన్‌ను ఎంపి క చేసింది. కెప్టెన్, వైస్ కెప్టెన్‌తో పాటు కోచ్, మెంటార్ వివరాలను ప్రణవ గ్రూప్ ఎండి బి.రవికుమార్, కో ఓనర్ డాక్టర్ సాయిసువీర్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా జరుగుతున్న టీజీ20 లీగ్‌లో తమ జట్టు వైస్ కెప్టెన్‌గా నితి న్ సాయి యాజవ్, మెంటార్‌గా సలామ్ బయాష్, హెడ్ కోచ్‌గా అభినవ్ కుమార్ వ్యవహరిస్తారని తెలిపారు.

ఈ లీగ్ కోసం రంగారెడ్డి ఫ్రాంచైజీని బూరుగు ఇన్ ఫ్రా, ప్రణవ గ్రూప్ రూ.7.2 కోట్లకు దక్కించుకున్నాయి. ఇటీవల జరిగిన వేలంలో యు వ, సీనియర్ ఆటగాళ్లతో జట్టును సమతూకంగా నిర్మించామని పేర్కొన్నారు. రంగారెడ్డి రైజర్స్‌లో అండర్ 19 ప్లేయర్, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అరవెల్లి అనినాశ్ రావు, అండర్ 19 ప్లే యర్లు ఆరోన్ జార్జ్, ఇండియా ఏకు ఆడిన అలంక్రిత్, రంజీ ట్రోఫీ ప్లేయర్ పున్నయ్య వంటి కీలక ఆటగాళ్లున్నారు. కాగా తొలి సీజ న్ కోసం తమ జట్టును పక్కాప్రణాళికతో సి ద్ధం చేసుకున్నామని, మంచి ప్రదర్శన కనబరుస్తుందన్న నమ్మకం ఉందని ప్రణవ గ్రూప్ ఎండి రవికుమార్ చెప్పారు.

రాష్ట్రంలో యువ ఆటగాళ్లకు అద్భుతమైన వేదికగా టీజీ20 లీగ్ ఉపయోగపడుతుందని కో ఓనర్ సాయి సువీర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రం గారెడ్డి రైజర్స్ యంగ్ క్రికెటర్లకు గొప్ప ప్రోత్సాహం అందిస్తుందన్నారు. టీజీ20 లీగ్‌లో ఫ్రాంచై జీ కొనుగోలు చేయడం వెనుక వ్యాపారఆకాంక్ష కంటే యువ క్రికెటర్ల ప్రతిభను గుర్తిం చడమే తమ ప్రధాన లక్ష్యంగా ఉందని ప్ర ణవ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు బూరుగు చెప్పారు. ఇక జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రావడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్టు కెప్టెన్ తనయ్ త్యాగరా జన్ చెప్పుకొచ్చారు. టీజీ20 లీగ్‌లో రంగారెడ్డి రైజర్స్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 22న నల్గొండ నైట్స్‌తో ఆడనుంది.