స్వీడన్ చేతిలో ట్యునీషియా చిత్తు
16-06-2026 12:00 AM
ఎస్టాడియో: సాకర్ ప్రపంచకప్‌ను స్వీడన్ అదిరిపోయే విజయంతో ఆరంభించింది. తమ తొలి మ్యాచ్‌లో ట్యునీషియాను 5 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. యాసిన్ అ యారీ డబుల్ గోల్స్‌తో అదరగొడితే, అలెగ్జాండర్, విక్టర్ స్వీడన్ విజయంలో కీలకపాత్ర పోషించారు.
మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన స్వీడన్‌కు ఏడో నిమిషంలోనే యాసిన్ అయారీ ఆధిక్యాన్నందించాడు. 30వ నిమిషంలో విక్టర్ మరో గోల్ కొట్టడంతో ఆధిక్యం 2 పెరిగింది. త ర్వాత ట్యునీషియా గోల్ చేసి స్వీడన్ ఆధిక్యాన్ని 2 తగ్గించింది. అయితే సెకండాఫ్‌లో స్వీడన్ మరింత దూకుడుగా ఆడి వరుసగా మూడు గోల్స్ నమోదు చేసింది. ఫస్టాఫ్‌లో కాస్త పర్వాలేదనిపించిన ట్యూనీషియా తర్వాత తేలిపోయింది.






