ఐర్లాండ్‌లో అల్లర్లు
భారత్‌తో సిరీస్‌పై సస్పెన్స్
పరిస్థితిని గమనిస్తున్నాం: బీసీసీఐ
బెల్ ఫాస్ట్, జూన్ 12: జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్ ల టీ20 సిరీస్ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఐర్లాండ్‌లో కమ్యూనిటీ అల్లర్లు, ఘర్షణలు జరుగుతున్నాయి. వలసదారులకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ ఘర్షణల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని స్థానిక క్రీడా టోర్నీలను రద్దు చేశారు. లిస్బర్న్ వేదికగా జరగాల్సిన ఇంటర్- ప్రొవిన్షియల్ టీ20 ఫెస్టివల్ అనే లోకల్ క్రికెట్ టోర్నీని కూడా క్రికెట్ ఐర్లాండ్ తాత్కాలికంగా రద్దు చేసింది.
కాగా జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో భారత్ రెండు మ్యాచ్‌లు టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యా చ్‌లు నార్తర్న్ ఐర్లాండ్ రాజధాని బెల్ ఫాస్ట్‌లో జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు ఈ వేదిక దగ్గరగా ఉండటంతో ఆటగాళ్ల భద్రతపై ఆం దోళన నెలకొంది. ఒకవేళ అక్క డి పరిస్థితులు అదుపులోకి రాకపోతే.. సిరీస్ వాయి దే పడే ప్రమాదం ఉంది. బీసీసీఐ కూడా అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తోం ది. ప్రస్తుతం తమ దేశంలో నెలకొన్ని అల్లర్ల నేపథ్యంలో 48 గంటల్లో అప్డేట్ ఇస్తామని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.






