జస్టిస్ చంద్రకుమార్‌కు జయశంకర్ స్ఫూర్తి పురస్కారం
10-08-2026 12:00 AM
కవి, రచయిత, నాటక కర్త జస్టిస్ చంద్రకుమార్‌ను అరుదైన గౌరవం దక్కింది. తెలం గాణ రచయితల వేదిక (తెరవే) యేటా ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న ప్రొఫెసర్ జయం శంక్ జయశంకర్ స్ఫూర్తి పురస్కారానికి ఈ ఏడా ది జస్టిస్ చంద్రకుమార్ ఎంపికయ్యారు. కరీంనగర్‌లోని ఫిలింనగర్‌లో ఈనెల ౧౪న జరుగనున్న కార్యక్రమంలో ఆయనకు పురస్కార ప్రదానం చేస్తామని తెరవే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్ల వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చరిత్రకారుడు డాక్టర్ సుంకిరెడ్డి నారా యణరెడ్డి హాజరవుతారని వెల్లడించారు.






