calender_icon.png 15 July, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జయశంకర్ సేవలు చిరస్మరణీయం

07-08-2024 04:36:43 AM

జయంతి వేడుకల్లో వక్తలు

విజయక్రాంతి నెట్‌వర్క్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాటం సాగించిన ప్రొఫెసర్ జయశంకర్ సేవలను తెలంగాణ సమాజం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయనకు పలు వురు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజ లు, విద్యార్థులు ఘన నివాళులర్పించారు. 

  1. శాసనసభా ప్రాంగణంలో జయశంకర్ చిత్రపటానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాళులర్పించారు.  
  2. ములుగులో మంత్రి సీతక్క, భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రొఫెసర్ జయశంకర్‌కు ఘన నివాళులర్పించారు. 
  3. హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ ఏకశిలా పార్కులోని జయశంకర్ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ పూలమాల వేసి నివాళులర్పించారు. 
  4. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళుల్పరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 
  5. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అడిషనల్ కమిషనర్లు శ్రీవాస్తవ, చంద్రకాంత్ రెడ్డి, యాదగిరి రావు, అకౌంట్ ఎగ్జామినర్ వెంకటేశ్వర రెడ్డి, జాయింట్ కమిషనర్ మైఖేల్ బోస్, సీపీఆర్వో మహమ్మద్ ముర్తుజా, పీఆర్‌వో విజయలక్ష్మి, ఏఎంసీలు జీవన్‌కుమార్ పాల్గొన్నారు. 
  6. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ అనుదీప్, జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులు, హైదరాబాద్ మెట్రో రైల్ భవన్‌లో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. 
  7. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యాలయంలో టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శి ఏ వాణి ప్రసాద్ పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అకాడమీ కార్యదర్శి నమోజు బాలచారి, పర్యాటక శాఖ సంచాలకులు ఇలా త్రిపాఠి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ, డాక్టర్ రాపోలు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. 
  8. రాజన్న ఆలయ అతిథి గృహంలో జరిగిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశం కర్ చిత్రపటానికి ప్రభుత విప్ ఆది శ్రీనివాస్ పూలమాల వేసి నివాళుల ర్పించారు. 
  9.  కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో జయశంకర్ చిత్రపటానికి ఎమ్మెల్యే కోవలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు.
  10. సింగరేణి  సీఎండీ ఎన్ బలరామ్ సింగరేణి భవన్‌లో జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొని జయశంకర్‌కు నివాళి అర్పించారు. 
  11. విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ సంఘం అంబర్‌పేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో తిరుమల నగర్ చౌరస్తాలో జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షుడు బ్రహ్మశ్రీ నాగరాం భాస్కర్‌చారి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి వినోద్ కుమార్, ముఖ్య సలహాదారులు అంజయ్యచారి, మేడ్చల్ సంపత్‌కుమార్‌చారి, పులిమామిడి శ్రీహరిచారి, సభ్యులు మురళీసురేశ్, రవీందర్, అంజయ్య, కృష్ణమూర్తి పాల్గొన్నారు. 

స్వరాష్ట్రం కోసం పరితపించిన మహనీయుడు ప్రొ. జయశంకర్ : కేటీఆర్

తెలంగాణ స్వరాష్ట్రం కోసం పరితపించిన మహనీయుడు ప్రొఫెసర్ జయ శంకర్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా మంగళ వారం ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.