2 July, 2026 | 6:28 PM

జేఈఈ అడ్వాన్స్‌డ్ షెడ్యూల్ విడుదల

03-12-2024 02:10 AM

మే 18న నిర్వహణ

హైదరాబాద్, డిసెంబర్2(విజయక్రాంతి): ఐఐటీ (ఇండియన్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 2025 మే 18న నిర్వహించ నున్నట్లు ఐఐటీ కాన్పూర్ సోమవారం తెలిపింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఏటా ఒక్కో ఐఐటీకి అప్పగిస్తుండగా, ఈసా రి ఐఐటీ కాన్పూర్‌కు అప్పగించారు. ఇందులో రెండు పేపర్లు ఉండగా.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్--2కు పరీక్ష నిర్వహిస్తారు.

రెండు పేపర్లకు హాజరు తప్పనిసరి. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. జనవరి 22 నుంచి 31 వరకు జేఈఈ మెయిన్స్-1, ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకూ మెయిన్స్--2 పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షల్లో అర్హత సాధించిన వారిలో మెరిట్ ప్రకారం దాదాపు 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపికచేస్తారు. కాగా దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్ల్లో 17,740 బీటెక్ సీట్లు ఉన్నాయి.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యేవారు ఇలా

క్యాటగిరీ              అభ్యర్థులు 

ఓపెన్                 1,01,250

ఈడబ్ల్యూఎస్ 25,000

ఓబీసీ   67,500

ఎస్టీ   18,750

ఎస్సీ       37,500

మొత్తం              2,50,000