calender_icon.png 20 October, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల

20-10-2025 12:14:48 AM

జనవరిలో తొలిసెషన్, ఏప్రిల్‌లో రెండో సెషన్ పరీక్షలు

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): జేఈ ఈ మెయిన్-2026 పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 మధ్య జేఈఈ మెయిన్ సెషన్-1, ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10 మధ్య సెషన్-2 జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివా రం విడుదల చేసింది. పరీక్ష రాసే విద్యార్థులు తమకు నచ్చిన పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఆన్ లైన్ అప్లికేషన్‌లో ఏమైనా తప్పులు ఉంటే సవరించేందుకు విద్యార్థులు ముందు గానే తమ ఆధార్ కార్డులను తప్పులు లేకుండా అ ప్డేట్ చేసుకోవాలని సూచించింది. షెడ్యూల్ పూర్తి వివ రాలకు జేఈఈ ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను సం దర్శించాలని పేర్కొంది.