calender_icon.png 19 October, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌ ఓటమి..

19-10-2025 05:10:07 PM

భారత్ vs ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా(Australia)లోని పెర్త్‌ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచులో భారత్‌(India)పై ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. వర్షం కారణంగా మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. ఆంపైర్లు ఆటను 26 ఓవర్లకు కుదించగా భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు శుభ్‌మాన్ గిల్(10), రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ(0) పరుగులతో తీవ్ర నిరాశ పరిచారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో ఉంది. డక్‌వర్త్ లూయిస్-స్టెర్న్(DLS) పద్ధతి ప్రకారం ఆంపైర్లు 131 పరుగుల లక్ష్యన్ని నిర్దేశించారు. 21.1 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి లక్ష్యన్ని ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్(46), జోష్ ఫిలిప్(37), రెన్ షా(21) పరుగులు చేశారు. రెండో వన్డే గురువారం జరగనుంది.