3 July, 2026 | 9:27 PM

Breaking News

రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •  

జేఈఈ మెయిన్స్ ఫలితాలపై ఎన్‌టీఏ కీలక ప్రకటన

18-04-2025 11:49 AM

హైదరాబాద్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (Joint Entrance Examination) మెయిన్ 2025 సెషన్- 2 ఫలితాలను ఏప్రిల్ 19 నాటికి ప్రకటిస్తుంది. ఫలితాలను ప్రకటించే ముందు, తుది కీ ఏప్రిల్ 18న విడుదల చేయబడుతుంది. జేఈఈ మెయిన్ 2025 సెషన్-2 ఫైనల్ కీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు జేఈఈ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ శుక్రవారం ఎక్స్ లో పోస్ట్ చేసింది. జేఈఈ మెయిన్స్ సెషన్-2 ఫలితాలపై ఎన్టీఏ నేడు స్పందించింది. 

గురువారం జేఈఈ మెయిన్స్ సెషన్-2(JEE Mains Session-2) ఫైనల్ కీని ఎన్టీఏ ప్రకటించింది. విడుదల చేసిన కాసేపటికే వెబ్ సైట్ నుంచి ఫైనల్ కీని తొలగించింది. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్ సెషన్-2 ప్రిలిమినరీ ఆన్సర్ కీలలో తొమ్మిది తప్పులు ఉన్నాయని ముందుగా అభ్యర్థులు, నిపుణులు గుర్తించారు. కోటా విద్యార్థులు తెలిపిన ప్రకారం, ఏప్రిల్ 11న విడుదలైన ఆన్సర్ కీలలో భౌతిక శాస్త్రంలో నాలుగు, రసాయన శాస్త్రంలో మూడు, గణితంలో రెండు లోపాలు ఉన్నాయి. వారు ఆ లోపాలను పూర్తిగా వాస్తవ లోపాలుగా అభివర్ణించారు. ఈ ప్రశ్నలను ప్రవేశ పరీక్ష నుండి తొలగించాలని సూచించారు. ఎన్టీఏ జేఈఈ మెయిన్ సెషన్- 2 ఫలితాల కోసం యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు తమ దరఖాస్తు సంఖ్య, పుట్టిన తేదీని ఉపయోగించాల్సి ఉంటుంది.