3 July, 2026 | 10:18 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ముంబై ఇండియన్స్ ఘన విజయం

18-04-2025 12:56 AM
  1. 4 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ ఓటమి
  2. విల్ జాక్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
  3. నేడు బెంగళూరుతో ముంబై ‘ఢీ’

విల్ జాక్స్ (2/14, 36 పరుగులు)

ముంబై, ఏప్రిల్ 17: ఐపీఎల్ 18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మూడో విజయా న్ని నమోదు చేసుకుంది. గురువారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 4 వికెట్ల తేడాతో ముం బై గెలుపును అందుకుంది. గత మ్యాచ్‌లో దుమ్మురేపిన హైదరాబాద్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు. 

తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40), క్లాసెన్ (37) పర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో విల్ జాక్స్ 2 వికె ట్లు తీయగా.. బౌల్ట్, బుమ్రా, పాండ్యా తలా ఒక వికెట్ పడగొట్టారు.

అనంతరం ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 18.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. విల్ జాక్స్ (36) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. రికిల్‌టన్ (31), సూర్యకుమార్ (26) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో పాట్ కమిన్స్ 3 వికెట్లతో మెరిశాడు. నేడు జరగనున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో పంజా బ్ కింగ్స్ తలపడనుంది.