30-12-2025 07:46:20 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో నిరుద్యోగ యువత యువకులకు బుధవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి పరశురాం నాయక్ తెలిపారు. హెచ్సీఎల్ టెక్ కంపెనీలో పలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు ఇంటర్ డిగ్రీ బి.టెక్ పాసైన వారు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో బుధవారం నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్సు డిపో ఎదుట గల ఏఐహెచ్డీసీఎల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ యువకులు సద్విని చూసుకోవాలని కోరారు.