calender_icon.png 30 December, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెట్ లీగ్ టోర్నమెంటులో ఎంఎంసిఏ రైడర్స్ గెలుపు

30-12-2025 07:41:43 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని ఏ.ఎం.సీ గ్రౌండ్ లో నిర్వహించిన క్రికెట్ లీగ్ టోర్నమెంటులో ఎంఎంసీఏ రైడర్స్ జట్టు గెలుపొందింది. ఫైనల్ పోటీలో ఎం ఎం సి ఏ  రైడర్స్ జట్టు ఎంఎంసీఏ బ్లాస్టర్ జట్టును ఓడించింది. 18 ఓవర్ల మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బ్లాస్టర్స్ జట్టు 16 ఓవర్లలో 93 పరుగులు చేసి ఆల్ అవుట్ కాగా రైడర్స్ జట్టు 16 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసి విజయం సాధించింది.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అభి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా శ్రీకాంత్ ఎంపిక అయ్యాడు. బెస్ట్ బౌలర్ గా చందు, బెస్ట్ బ్యాట్స్ మెన్ గా నవం ఎంపికయ్యారు. విజేతలకు సోమవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ నాయకులు నాతరి స్వామి మాట్లాడుతూ క్రికెట్ విజేతలను అభిందించారు. క్రీడలకు తమ పార్టీ తగిన ప్రోత్సాహం అందిస్తుందన్నారు. బెల్లంపల్లిలో క్రికెట్ అభివృద్ధి కోసం మురళి మెమోరియల్ క్రికెట్ అకాడమీ ఎంతగానో కృషి చేస్తున్నదని ప్రశంసించారు.

ప్రస్తుతం అద్దె స్థలంలో నిర్వహిస్తున్న అకాడమీకి ఎమ్మెల్యేను సంప్రదించి తగిన ప్రభుత్వ స్థలాన్ని అందించడానికి కృషి చేస్తామన్నారు. ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలోపట్టణ  కాంగ్రెస్ అద్యక్షుడు మల్లయ్య, కెరీర్ గ్రూపు చైర్మన్ గడ్డం రాజేష్ గౌడ్ తెలంగాణ క్రికెటర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్, కో ఆర్డినేటర్ అల్లం వెంకటేశ్వర్లు, ఎస్ జీ ఎఫ్ జోనల్ సెక్రెటరీ గోపాల్, ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజేష్,పి.డి బాబురావు, క్రికెట్ అకాడమీ కోచ్ డేవిడ్ పాల్గొన్నారు. ఎంపైర్లుగా గౌతం,హరీష్, దుర్గయ్య కామెంటేటర్ గా దినేష్ వ్యవహరించారు.