జిల్లాలోని పరిశ్రమల్లో ఆదివాసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
పాల్వంచ, ఆగస్టు 12, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గల కేటీపీఎస్ ధర్మల్ పవర్ స్టేషన్, భద్రాద్రి పవర్ ప్లాంట్, ఐ టి సి, భారజల కర్మాగారాల్లో స్థానిక ఆదివాసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది.
ఈ మేరకు బుధవారం పాల్వంచ మండల కేంద్రం కొమరం భీం భవన్ లొ. ఆదివాసీ సంక్షేమ పరిషత్.( ASP). భద్రాద్రి జిల్లా సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టు కనక రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఏ ఎస్ పి జిల్లా అధ్యక్షులు. వాగాబోయిన చంద్రయ్య దొర మాట్లాడుతూ... ఏజెన్సీ భద్రాద్రి జిల్లా లొ పుస్కాలమైన వనరులు ఉన్న వలస వాదులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆదివాసీ యువతకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
అధికారులు, పాలకులు ఏజెన్సీ చట్టాలు అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. వారి నిర్లక్ష్యంను ప్రతిగటిస్తూ సెప్టెంబర్ 28న సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆదివాసీ నిరుద్యోగ ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ధర్నాలో జిల్లాలోని ఆదివాసి నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఆదివాస సంక్షేమ పరిషత్ నాయకులు పడిగా అశోక్. కంగాల అభి, కోర్స వీరబాబు. తాటి లక్ష్మణ్ ,పడిగా రాంబాబు. గోగ్గేలా నాగార్జున్ తదితరులు పాల్గిన్నారు






