calender_icon.png 4 August, 2025 | 7:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి

21-09-2024 01:20:58 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 20  (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో  పదేండ్లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడు తూ.. గతంలో డిస్టర్బ్ అయిన లెక్చరర్లను జోనల్ వైజ్ ఖాళీల్లో సీనియా రిటీ ప్రకారం సర్దుబాటు చేయాలని కోరారు. జీవో నెంబర్ 1219లో తీసేసిన పోస్టులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సెకండ్ పోస్టుల్లో తీసేసిన వారందరిని కొనసాగించాలన్నారు. సమావేశంలో నాయకులు కోడి మహేశ్ కుమార్, ఎం బాబురావు, ఎల్ శ్రీకాంత్ పాల్గొన్నారు.