calender_icon.png 4 August, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సర్దుబాటుపై విద్యాశాఖ పునఃసమీక్షించాలి

21-09-2024 01:22:02 AM

పీఆర్టీయూ తెలంగాణ

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటుకు సంబంధించి విద్యాశాఖ జారీ చేసిన ఆదేశాలను పునః సమీక్షించాలని పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.చెన్నయ్య, మహమ్మద్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకంగా ప్రాథమిక పాఠశాలల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో విద్య కుంటుపడుతుందని, ఒకే ఉపాధ్యాయునితో 60 మంది పిల్లలకు సక్రమమైన బోధన ఎలా అందుతుందో అధికారులే ఆలోచించాలన్నారు. అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోనూ ప్రతీ సబ్జెక్టుకు ఒక టీచర్ ఉండాల్సిందేనని పేర్కొన్నారు.