calender_icon.png 6 December, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి అండగా ఉందాం

06-12-2025 07:16:15 PM

పార్టీలో చేరిన వారి గౌరవానికి హాని కలిగించం..

దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి..

భూత్పూర్: వాస్తవాలకు దగ్గరగా ఉంటూ ప్రతి విషయాన్ని పారదర్శకంగా ముందుకు తీసుకుపోతూ అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ కు అండగా నిలవాల్సిన అవసరం ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నేడు దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే జియంఆర్ ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారి గౌరవానికి ఎక్కడ హాని కల్పించకుండా సమిష్టిగా అభివృద్ధి వైపు ప్రయాణం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.