06-12-2025 07:14:31 PM
ముకరంపుర,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు నగరంలోని భగత్ నగర్ లెజెండ్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రేష్ట నందిని ఎంపికయ్యింది. ఈనెల 8 నుండి మూడు రోజులపాటు ఆదిలాబాద్ లో జరగనున్న 36వ సౌత్ జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ పోటీలలో ఆమె పాల్గొనున్నది. సందర్భంగా విద్యార్థినిని పాఠశాల కరస్పాండెంట్ రాజయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.