calender_icon.png 4 December, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగం వర్షిత్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరికలు

04-12-2025 12:00:00 AM

చిట్యాల, డిసెంబర్ 3 (విజయ క్రాంతి):  నల్గొండ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి    సమక్షంలో  చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామానికి చెందిన పలువురు నాయకులు బిజెపి పార్టీలో బుధవారం చేరారు. వారికీ నాగం వర్షిత్ రెడ్డి పార్టీ కండువా కప్పి  ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడితే కచ్చితంగా తగిన గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు.

చేరిన వారిలో మదన్ మోహన్ రావు, దేశ గాని శంకర్, రొడ్డ రవీందర్, మల్యాల యాదగిరి, సత్యనారాయణ, శ్రావణ్ కుమార్, నరేందర్, లింగయ్య, బొడ్డు శీను, ఎల్లె నరసింహ ఉన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల అధ్యక్షుడు పీకే వెంకన్న ముదిరాజ్, ఆకుల వెంకన్న, మాస శ్రీనివాస్, విద్యాసాగర్, పల్లి రామరాజు  పాల్గొన్నారు