5 August, 2026 | 10:33 PM

విద్యార్థి నాయకుల ఎన్‌త్రోన్‌మెంట్ వేడుకలు

05-08-2026 09:36 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ స్థానిక జ్యోతినగర్‌లోని పారమిత ఎక్స్‌ప్లోరికా పాఠశాలలో ఈరోజు విద్యార్థి నాయకుల ఎన్‌త్రోన్‌మెంట్ వేడుకలును ఘనంగా నిర్వహించారు. ఇటీవల పాఠశాలలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన విద్యార్థి ప్రతినిధులు బాధ్యతలను స్వీకరించి విధేయతతో సేవలు అందిస్తామని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై తమ పిల్లలు నాయకత్వ బాధ్యతలు స్వీకరించడాన్ని గర్వంగా వీక్షించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు మరియు ఇతర కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పారమిత విద్యాసంస్థల చైర్మన్ డా. ఇ. ప్రసాద్ రావు మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ఆలోచన, క్రమశిక్షణ, సేవాభావం మరియు ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.