ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
18-07-2026 12:45 AM
సంస్థాన్ నారాయణపూర్,జూలై 17 : మండలంలోని అల్లందేవిచెరువు గ్రామంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన ముఖ్య మంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అల్లందేవి చెరువు గ్రా మానికి చెందిన వట్టికోటి శేఖర్, బద్దం నర్సిరెడ్డిలకు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా నా యకులు మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాత్క శేఖర్,నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.






