17 July, 2026 | 12:57 AM

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

17-07-2026 12:57 AM

ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జూల్ ౧౬ (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా బంగ్లగూడ ఆర్జీ కాలనీకి చెం దిన పలువురు నాయకులు గురువారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి పార్టీ కండు వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్. బాలకృష్ణ, పోతారం శివకుమార్, పో తారం నవీన్ కుమార్, డి. శివ, సీహెచ్. శివా జీ, దర్శనపు ప్రభాకర్ టీఆర్పీలో చేరారు.

కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా యువజన అధ్యక్షు డు సింగం అరుణ్ పటేల్, జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, మురళి పా ల్గొన్నారు. కాగా తీన్మార్ మల్లన్నను హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు మహేం దర్ జైన్, కర్వాన్ నియోజకవర్గ ఇంచార్జి టీవీఆర్ మ ర్యాదపూర్వకంగా కలిశారు.

బీసీల హక్కులు, సంక్షేమం కోసం చేస్తున్న గు ర్తింపుగా ఆయనను బీసీ సంక్షేమ కమిటీ స భ్యుడిగా నియమించడంపై శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, బీడబ్ల్యూయూ చైర్మన్ సంపత్ ముదిరాజ్ పాల్గొన్నారు.