తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, ఏప్రిల్ 9(విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన ముత్యాల మనీష్, పల్లాటి రవి, అభినవ్, రమావత్ ప్రేమ్ చరణ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై గురువారం టీఆర్పీలో చేరారు. ఈ సందర్భంగా టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ యువత రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అని, వారి శక్తి, సామర్థ్యాలతో పార్టీ ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణలో బీసీల హక్కుల సాధన కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.కొత్తగా చేరిన యువకులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవలో ముందుండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందరపు నరసయ్య గౌడ్,రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్,కార్మిక విభాగం అధ్యక్షుడు సంకూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.




