21 July, 2026 | 11:46 PM

Breaking News

ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు

10-04-2026 12:57 AM

మణికొండ, ఏప్రిల్ 9  ( విజయక్రాంతి) : నార్సింగి సర్కిల్ 45 పరిధిలో ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్న రోడ్డు, ఫుట్పాత్ ఆక్రమణలను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. వివి ధ ప్రధాన మార్గాల్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో మొత్తం 137 ఆక్రమణలను తొలగించినట్లు నార్సింగి డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. నార్సింగి ట్రాఫిక్ ఎస్హెచ్‌ఓ, లా అండ్ ఆర్డర్ ఎస్హెచ్‌ఓ సమన్వయంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు.

ఆర్కే గ్రాండ్ హోటల్ నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకు, అక్కడి నుంచి వైఎస్‌ఆర్ విగ్రహం వరకు, రాయల్ ఫంక్షన్ హాల్ నుంచి నార్సింగి సర్కిల్ వరకు ప్రధాన రహదారుల వెంబడి ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, బోర్డులను తొలగించారు. పాదచారులకు, ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించేలా ఫుట్పాత్లను, రోడ్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్, పోలీస్ అధికారులు హెచ్చరించారు.