calender_icon.png 17 May, 2025 | 11:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సజావుగా ధాన్యం కొనుగోలు

17-05-2025 12:00:00 AM

  1. 60 శాతం సేకరణ పూర్తి 

ప్రతి ధాన్యపు గింజ కొనుగోలుకు చర్యలు

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్ మే 16( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ధాన్యం కొనుగోలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరఫరా ల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించినట్టు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.

శుక్రవారం హైదరాబాద్ నుండి మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ధాన్యం కొనుగోళ్లపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్టు ఆమె పేర్కొన్నారు. జూన్ మొదటి వారం లోగా ధాన్యం కొనుగోల ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు తెలిపారు. అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో ధాన్యం కొను గోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని తెలిపారు.

ఇప్పటివరకు జిల్లాలో కొనుగోలు చేసిన వరి ధాన్యం వివరాలు, ఇంకను కొనుగోలు చేయాల్సిన అంచనాలు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ట్యాబ్ల ద్వారా రోజువారీ గా కొనుగోలు వివరాలు నమోదు చేయాలని సూచించారు. రిజిస్టర్లు పకడ్బందీగా నిర్వహించాలని, తేమ పేరుతో రైతులనుండి అధికంగా ధాన్యం సేకరిస్తే సంబంధిత కేం ద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇప్పటికే 60 శాతం ధాన్యం సేకరణ పూర్తీ అయిందని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని ప్రతి ధాన్యపు గింజను కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు. ఈ సమావే శంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో, ఇంచార్జీ డి ఎస్ ఓ కోమల్ రెడ్డి, సివిల్ సప్లయిస్ డిఎం సుధాకర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.