08-09-2025 01:28:27 AM
రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టుకు అర్హులు లేరా?
ఉన్నత అధికారుల చలువ ఉంటే ఎన్ని ఏళ్లయినా చేయొచ్చా..!
నాకంటే సీనియర్లు వస్తే తప్పుకుంట : మధుసూదన్ గౌడ్, పశుసంవర్ధక శాఖ ఇంన్చార్జి జెడి
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): నిబంధనలు ఎన్ని ఉన్నా అవి అ మలు చేసే ఉన్నత అధికారులు తమవైపు ఉంటే.. ఎన్నేళ్లయిన ఉన్నత పోస్టులో బాధ్యతలను నిర్విరామంగా నిర్వహించేందుకు అ వకాశాలు మెండుగా ఉంటాయని ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. మహబూబ్ నగర్ జిల్లాలో గత ఆరేళ్ల నుంచి జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గా అసిస్టెంట్ డైరెక్టర్ వి ధులు నిర్వహిస్తున్నారు.
స్టేట్ క్యాడర్ పోస్ట్ అయిన జెడి పోస్ట్ కు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన అధికారులేరా అనే ప్రశ్న ఉత్పన్నమ వుతుంది. గత ప్రభుత్వ హయాంలో అప్పు డు ఉన్న పలుకుబడితో ఏడి బాధ్యతల్లో ఉన్న తన పలుకుబడితో ఇన్చార్జి జెడి పో స్టుల్లో కూర్చున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు కూడా యధావిధిగా జాయింట్ డైరెక్ట ర్ బాధ్యతలను నిర్వహిస్తూ ఇతరులను రానివ్వట్లేదంటూ ప్రచారం జరుగుతుంది. ఏండ్ల తరబడి ఇన్చార్జి జెడిగా ఉన్న ఉన్నత అధికారులు రెగ్యులర్ పోస్టు ఎందుకు భర్తీ చేయ డం లేదని సందేహం నెలకొంది.
-ఇంకెన్నాళ్లు జెడి ఇన్చార్జి....
మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే ఏడి గా ఉన్న 2019 లో ఇన్చార్జి జా యింట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టి నిర్విరామంగా కొనసాగుతున్నారు. జెడి జెడి పోస్టు స్టేట్ క్యాడర్ అయినప్పటికీ 2019 నుంచి ఇప్పటివరకు మహబూబ్ నగర్ జా యింట్ డైరెక్టర్ గా మధుసూదన్ గౌడ్ కొనసాగుతున్నారు. దాదాపుగా ఆరేండ్లు గడు స్తున్నా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పరిధిలో జెడి స్థాయిలో అధికారులు లేదంటే నమ్మే ప్రసక్తి లేదు.
రాష్ట్ర అధికారుల కనుసైగల్లో జాయింట్ డైరెక్టర్ గా గత ప్రభుత్వ దీవెనతో యధావిధిగా కొనసాగుతున్నారని తెలుస్తుం ది. ప్రభుత్వం మారిన జాయింట్ డైరెక్టర్ మహబూబ్ నగర్ వచ్చేందుకు అధికారులు లేరా..? రానివ్వట్లేదా..? అనే సందేహం వ్య క్తం అవుతుంది. ఏడిగా ఉన్న మధుసూదన్ గౌడ్ గత ప్రభుత్వం లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండదండలతో జాయింట్ డైరె క్టర్ గా బాధ్యతలు చేపట్టారని తెలుస్తుంది.
ఆ ప్రభుత్వంలో ఉన్నత అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి చక్రం తిప్పడంతో తిరిగి కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకొని ఆశావాహులు ఉన్నప్పటికీ మరో మారు తనదైన శైలిలో నూతన విధానాలకు శ్రీకారం చుట్టి జాయింట్ డైరెక్టర్ గా కొనసాగుతూ వస్తున్నారని పలువురు పే ర్కొంటున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆరేళ్ల నుంచి జాయింట్ డైరెక్టర్ కు అర్హులు అస్సలు లేకుండా ఎలా ఉంటారనే సందేహం వ్యక్తం అవుతుంది.
గత ప్రభుత్వ హయాంలో అట్లా ఈ ప్రభుత్వ హయాంలో ఇట్లా ఎలాగైనా జాయింట్ డైరెక్టర్ మనమే అనే విధంగా ఉండడంతో పలువురు ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు పూర్తిస్థాయిలో అర్హులైన అధికారులను పరిగణలోకి తీసుకొని నిబంధనల మేరకు స ముచిత స్థానం కల్పించవలసిన అవసరం ఉంది. ఏండ్ల తరబడి ఏడిగా ఉంటూ జా యింట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహించ డం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని పలు ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.
-ఏడిలే.. జేడీలు..
మహబూబ్ నగర్ జిల్లాను మరో నూత న నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేయడంతో ఐదు జిల్లాలు చేసిన విషయం అందరికీ వివిధమే. నూతన జిల్లాల ఏర్పాటుతో పశుసం వర్ధక శాఖ జిల్లా కార్యాలయాల్లో అసిస్టెంట్ డైరెక్టర్లు గా బాధ్యతలుగా ఉన్న అధికారులు జాయింట్ డైరెక్టర్ బాధ్యతలలో కొలువుతీరారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వ హిస్తున్నప్పటికీ డిప్యూటీ డైరెక్టర్ గా చేసిన తర్వాతనే జాయింట్ డైరెక్టర్ గా పదోన్నతి లభిస్తుంది.
జిల్లాల ఏర్పాటు పుణ్యంతో ఏడిలే జేడీలుగా కొనసాగుతున్నారు. గత నెల రోజుల క్రితం హైదరాబాద్ పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఏడి గా బాధ్య తలు నిర్వహించిన వెంకటేశ్వర్లు డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతి తో జోగులాంబ గ ద్వాల జిల్లాకు ఇంచార్జ్ జాయింట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నాగర్ క ర్నూల్ జిల్లాలో ఏడిగా ఉన్న జ్ఞానేశ్వర్, నారాయణపేట జిల్లాలో ఏడిగా ఉన్న ఈ శ్వర్ రెడ్డి, వనపర్తి జిల్లాలో ఏడిగా ఉన్న వెంకటేశ్వర్ రెడ్డి లు డిప్యూటీ డైరెక్టర్లు కాకముందే ఇన్చార్జి జాయింట్ డైరెక్టర్లుగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఉన్నత అధికారులు పూర్తిస్థాయిలో న్యాయబద్ధంగా పదోన్నతుల బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నాకంటే సీనియర్లు వస్తే తప్పుకుంట
ప్రస్తుతం ఏడిగా సీనియర్ గా ఉన్నాను. జాయింట్ డైరెక్టర్ గా 2019 సంవత్సరం నుంచి ఉంటున్న వాస్తవమే. నాకంటే సీనియర్లు పదోన్నతితో వస్తే తప్పుకుంటాను. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాను. జిల్లావ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ పరిధిలో అవసరమైన సహకారాలు అందిస్తున్నాం.
మధుసూదన్ గౌడ్, పశుసంవర్ధక శాఖ ఇన్చార్జి జెడి, మహబూబ్ నగర్ జిల్లా