15 June, 2026 | 1:28 AM

ఘనంగా జర్నలిస్ట్ వెంకట్ పుట్టినరోజు వేడుకలు

15-06-2026 12:17 AM

ఖమ్మం, జూన్ 14(విజయక్రాంతి): టి.డబ్ల్యూ.జె.ఎఫ్. నగర కార్యదర్శి, నవతెలంగాణ జర్నలిస్ట్ గరిడేపల్లి వెంకట్ జన్మదిన వేడుకలు ఆదివారం నగరంలో ఘనంగా జరిగాయి. స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహిం చిన ఈ వేడుకల్లో క్యాంప్ ఇన్ఛార్జ్ తుంబూ రు దయాకర్రెడ్డి సమక్షంలో వెంకట్ కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా దయాకర్రెడ్డి, టి.డబ్ల్యూ.జె.ఎఫ్. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిలా నిలుస్తున్నారని కొనియాడారు. సవాళ్లతో కూడిన మీడియా రంగంలో వెంకట్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయనను ఘనంగా సత్కరించారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి మానుకొండ రవికిరణ్, నాయకులు జానీపాషా, చక్రవర్తి, పత్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.