calender_icon.png 3 December, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

03-12-2025 01:18:40 AM

టీయూడబ్ల్యూజే మహాధర్నా కరపత్రాల ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 2(విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 3న హైదరాబాద్లో నిర్వహించనున్న మహా ధర్నా కరపత్రాలను వేములవాడ పట్టణంలో మంగళవారం టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్,రాష్ట్ర లీగల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు రేగుల దేవేందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నూగురి మహేష్, జిల్లా జాయింట్ సెక్రెటరీ రాపల్లి శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ దూలం సంపత్, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మ్యాన శ్రీ నివాస్, ఉల్లెందుల మల్లేశం, సయ్యద్ పాష, జర్నలిస్టులు గడిల ప్రవీణ్ కుమార్, ఏం. ఏ కలీం పాషా, గంప మహేష్, తోట అనిల్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దండి సంతోష్ కుమార్ మాట్లాడుతూ. జర్నలిస్టులకు కొత్తగా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని ఆరోగ్య భీమా పథకాన్ని పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చే యాలని, వృత్తి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.డిసెంబర్ 3న హైదరాబాద్ మసాబ్ ట్యాంక్లోని రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గం టలకు జరగనున్న మహా ధర్నాకు రాష్ట్ర, జాతీయ, జిల్లా, మండల నాయకులు తోడ్పడాలని, యూనియన్ సభ్యులు సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.