17 June, 2026 | 12:11 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

కనీస వసతులు కల్పించలేదని జర్నలిస్టుల ధర్నా

14-02-2026 12:00 AM

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధు మోహన్  హామీతో ఆందోళన విరమించిన జర్నలిస్టులు 

కామారెడ్డి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): కౌంటింగ్ కేంద్రంలో జర్నలిస్టులకు కనీస వసతులు కల్పించలేదని శుక్రవారం కౌంటింగ్ కేంద్రం ఎదుట జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. జర్నలిస్టులకు ప్రత్యేకంగా కూర్చోవడానికి కుర్చీలు వేయలేదని, ఫలితాలు చూసేందుకు టీవీ అమర్చలేదని, కనీసం నీటి సౌకర్యం కల్పించలేదని ఆందోళన చేశారు. డిపిఆర్‌ఓ తీరుపై అగ్రహాo వ్యక్తం చేశారు.

దీంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్ జర్నలిస్టుల ఆందోళన వద్దకు వచ్చి సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తమ దృష్టికి రాకపోవడం వల్ల ఇబ్బంది ఏర్పడిందని వెంటనే ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో జర్నలిస్టులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు రజనీ కాంత్, వేణుగోపాల చారి, శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, సిద్ధి రాములు, విజయానంద్, స్వామి, ఆశన్న, రాజు, తదితరులు పాల్గొన్నారు.