calender_icon.png 15 February, 2026 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దమ్మయాత్రకు ఘన స్వాగతం

14-02-2026 12:00:00 AM

మునిపల్లి, ఫిబ్రవరి 13: కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా లో ఈనెల 1న ప్రారంభమైన దమ్మ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ మీదుగా శుక్రవారం మునిపల్లి మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా మునిపల్లి మండలంలోని లింగంపల్లి, కంకోల్, బుదేరా గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగగా  వివిధ పార్టీల నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు వారిపై పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు.

ఈ పాదయాత్రలో యాత్ర సంఘ ప్రాజెక్టు డైరెక్టర్ సొంగా షాక్ కోవిడో, థాయిలాండ్ బౌద్ధ భిక్షావులు, గగన్ మాలిక్ ఫౌండేషన్ అధ్యక్షుడు గగన్ మాలిక్, రాజమూర్తి, సిద్దోజి, శ్యాంసుందర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గగన్ మాలిక్ మాట్లాడుతూ విశ్వశాంతి తో పాటు ప్రజలంతా సోదర భావంతో ఉండాలని ఉద్దేశంతో ఈ దమ్మ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమన్నారు. అలాగే ఈ యాత్ర మార్చి 3న నాగార్జునసాగర్ కు చేరుకుంటుందన్నారు. 

ఈ కార్యక్రమంలో   టీజీవో జిల్లా అధ్యక్షుడు వైద్యనాథ్, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు బక్కన్న నాగయ్య, రాజు,    రాయికోడ్  మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్, మాజీ ఎంపీపీ రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రసూల్ పటేల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపిటిసి పాండు,

కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రాజు, సర్పంచులు రాజగోని  సౌందర్య నరేందర్ గౌడ్, బుడ్డ మల్లేశం, కోలుకుంద మల్లేశం, బేగర్ మల్లేశం, మాజీ కో ఆప్షన్ సభ్యుడు రహీం, అంబేద్కర్ సంఘం నాయకులు, మాజీ సర్పంచ్ రాములు, నాయకులు నాగేష్, మహేందర్, కృష్ణ, భాస్కర్, ప్రవీణ్, నర్సింలు, సురేష్, నర్సింలు, కిష్టన్న తదితరులు పాల్గొన్నారు.