13 April, 2026 | 7:08 PM

పోషక ఆహారంపై అవగాహన కార్యక్రమం

13-04-2026 05:34 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం-6లో పోషణ పఖ్వాడా సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొదటి వెయ్యి రోజులలో పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించేందుకు గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, సంరక్షకులతో సమావేశం నిర్వహించి సమతుల్య ఆహారం తీసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదలలో తల్లుల పోషకాహారం కీలకమని, గర్భధారణ దశ నుంచి సరైన ఆహారం తీసుకుంటే తల్లి-శిశువు ఆరోగ్యం మెరుగుపడుతుందని అధికారులు వివరించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, వార్డు సభ్యురాలు ఏనుగు లక్ష్మి మిల్లెట్స్‌తో తియ్యని వంటకాలు తయారు చేసి పోషకాహారంపై అవగాహన కల్పించారు.