31 May, 2026 | 6:45 PM

Breaking News

రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •   అది రైతు డిస్కం కాదు... రైతుల ప్రాణాలు తీసే 'బలిపీఠం'!   •   వరికొయ్యలు, పంట అవశేషాలను కాల్చొద్దు   •  

రోడ్డు భద్రత అందరి బాధ్యత..!

13-04-2026 06:26 PM

- జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ వాహనదారులతో ప్రతిజ్ఞ

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు సామాజిక బాధ్యతగా భద్రత చర్యలు తీసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి వి.లక్ష్మణ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ ఆఫీసులో సోమవారం ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. వాహనదారులందరూ భద్రత ప్రమాణాలను పాటించాలన్నారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, నిదానంగా ప్రయాణించడం, రోడ్డు భద్రత సూచనలు పాటించాలన్నారు.

సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు.. ప్రమాద రహిత సమాజం కోసం కృషి చేయాలని లక్ష్మణ్ కోరారు. ప్రాణాలు అమూల్యమైనవని, ప్రమాదాల నివారణను సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఎవరికివారు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు జరగవని, మద్యం తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆఫీసుకు వచ్చిన వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.