19 June, 2026 | 10:32 AM

నియోజకవర్గ రిపోర్టర్లకు జిల్లా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి

19-06-2026 09:21 AM

సత్తుపల్లిలో జర్నలిస్టుల ధర్నా!

సత్తుపల్లి జూన్ 19(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు జిల్లా అక్రిడిటేషన్ కార్డులు తక్షణమే మంజూరు చేయాలని సత్తుపల్లి జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున గురువారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల యూనియన్ నాయకులు, సిహెచ్, బాలకృష్ణ, సత్తుపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తోట కిరణ్, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సీనియర్ రిపోర్టర్లు మాదిరాజు సుధాకర్, ఎండి షైబుద్ధిన్,షేక్ ఖాదర్ బాబా మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా పత్రికలను ఏబిసిడిలుగా విభజించి రాష్ట్ర ప్రభుత్వం 252 జీవోను అనుసరించి జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న 252 జీవోను వెంటనే సవరించి నియోజకవర్గ స్థాయిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు జిల్లా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 

ప్రభుత్వం వెంటనే స్పందించి నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు జిల్లా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసి జిల్లా, రాష్ట్రస్థాయిలో బస్సులో ప్రయాణించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు షేక్ ఖాదర్ బాబా, రామ్మిశెట్టి లక్ష్మణరావు, తడికిమళ్ళ దేవా, భీమ్మిశెట్టి రాము, జె.శ్రీనివాసరావు, ఐ శ్రీను, బాలాజీ, సుధాకర్, శ్రీకాంత్, జె.శ్రీనివాసరావు, మోహన్ గురవయ్య, సురేష్, అశోక్ రాజా, ఆనంద్, రామారావు, రాజేష్ రెడ్డి, గంగాధర్, bhమెహారాజ్, చిరంజీవి, పాలకుర్తి. శ్రీనివాసరావు.జగన్, పలువురు రిపోర్టర్లు తదితరులుపాల్గొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులు బస్సు పాస్‌ల పంపిణీలో జర్నలిస్టుకు జరుగుతున్న అన్యాయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని వారు కోరారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అర్హత గల జర్నలిస్టులు అందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆమె జర్నలిస్టుల సమస్యలను పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.