20-01-2026 11:59:50 PM
మఠంపల్లి, జనవరి 20: మఠంపల్లి మండలంలోని భీల్యానాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోతు రాముడు నాయక్ విజయక్రాంతి దినపత్రిక నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ను మంగళవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమైందని,పాత్రికేయులు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలని కోరారు.ఈ పత్రికలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలకు తెలియజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ బానోతు పాండు నాయక్,సుశీల, రవీందర్, సైదులు తదితరులు పాల్గొన్నారు.