calender_icon.png 21 January, 2026 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరైవ్ అలైవ్ ఒక కార్యక్రమం కాదు.. ఉద్యమం

21-01-2026 12:00:00 AM

మొయినాబాద్, జనవరి 20( విజయక్రాంతి):  రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు చేపట్టిన ‘అరైవ్ అలైవ్‘ అవగాహన సదస్సు మంగళవారం హిమాయత్ నగర్లోని జేపీఎల్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, డీసీపీ యోగేష్ గౌతమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 

అరైవ్ అలైవ్ అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి ప్రాణాలను కాపాడే ఒక ఉద్యమం అని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఏటా 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ టాప్-10లో ఉండటం, రోజుకు సగటున 22 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ముఖ్యంగా యువత ప్రాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు తన వంతుగా 1,000 హెల్మెట్లను ఉచితంగా అందజేస్తానని ప్రకటించారు. ఈ సదస్సులో ఏసీపీ కిషన్, ఆర్టీఏ అధికారిణి సాయి కృష్ణవేణి, స్థానిక పోలీసులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో వాహనదారులు పాల్గొన్నారు.