calender_icon.png 14 November, 2025 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పే జూబ్లీహిల్స్ విజయం

14-11-2025 03:48:34 PM

యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు  బాబులు గౌడ్ (బోరబండ)

సనత్‌నగర్, (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పే జూబ్లీహిల్స్ విజయమని యువజన కాంగ్రెస్ మాజీ ఉపాధ్యక్షుడు  బాబులు గౌడ్ అన్నారు. శుక్రవారం బాబులు గౌడ్ ఆదివర్యం లో శ్రీ శభరి గిరీశ పాదయాత్ర స్వామిలు అందరు  జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడంతో ఆనందం తో కలిసి టపాకాయలు కాల్చి మిఠాయిలు ఒకరికొకరు తినిపించుకున్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుతో బిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత బట్టబయలు అయిందని ఇకనుండి అయిన అసత్య ఆరోపణలు మానేసి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని జూబ్లీ హిల్స్ నియోజకవర్గం  నేతృత్వంలో నవీన్ యాదవ్  పాలన సాఫీగా సాగుతుందని  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదేవిధంగా ప్రజలు టిఆర్ఎస్ పార్టీనీ సమాధి చేయడం ఖాయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  బోరబండ నుంచి పాదయాత్రలో 40 మంది సభ్యులు స్వామిలు తదితరులు పాల్గొన్నారు