గన్యతండా దేవాలయానికి మంత్రి పొంగులేటి అర్థిక సహాయం
11-04-2026 08:12 PM
కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం లింగరాంతండా గ్రామ పంచాయతీ శివారు గన్యతండా గ్రామంలో తండా వాసులు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బొడ్రాయి ప్రతిష్ట కు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అర్థిక సహాయం అఃదించారు. శనివారం ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో సర్పంచ్ బానోతు పుష్ప రవి, తండా వాసులకు మంత్రి పొంగులేటి సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వడ్తయ్య కిషన్, వడ్తయ్య బాలాజీ, బానోతు వెంకటేష్ పాల్గొన్నారు.




