1 June, 2026 | 2:29 PM

Breaking News

బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ తహసిల్దార్..   •   డాక్టర్ కళ్యాణికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు సన్మానం   •   విచారణకు హాజరైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్ రెడ్డి   •   నెల చివరి వరకు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు   •   రామంతాపూర్‌లో RTC బస్సును ఢీకొట్టిన కారు   •   పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ   •   ఆయిల్ పామ్ నర్సరీలో నాణ్యమైన మొక్కలు సిద్ధం చేయాలి   •   అంగన్వాడి కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క   •   BRS నేతల ముందస్తు అరెస్టులు.. అప్రజాస్వామికం   •   సీఎం జనజాతర సభకు మార్లవాయి గ్రామస్తుల భారీ తరలింపు   •  

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతి రావు పూలే

11-04-2026 07:41 PM

- కేయూ పరిశోధక విద్యార్థి డి.తిరుపతి

హనుమకొండ,(విజయక్రాంతి): అణగారిన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి, సామాజిక అసమానతలను తొలగించిన క్రాంతి రేఖ మహాత్మ జ్యోతిరావు పూలే అని కేయూ పరిశోధక విద్యార్థి డి తిరుపతి అన్నారు. శనివారం కాకతీయ యూనివర్సిటీలో వివేకనందా రీసెర్చ్ స్కాలర్స్  హాస్టల్లో, పరిశోధక విద్యార్థుల ఆధ్వర్యంలో రీసెర్చ్ స్కాలర్ డి.తిరుపతి అధ్యక్షతన మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమంను నిర్వహించారు. అనంతరం తిరుపతి  జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం తిరుపతి మాట్లాడుతూ... సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వారి విద్యాభివృద్ధి కోసం కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మా జ్యోతిబా పూలే  అని అన్నారు.సమసమాజ స్థాపనకు స్ఫూర్తి ప్రదాత,సామాజిక సంస్కరణలకు నాంది కర్తగా,బడుగు బలహీన వర్గాల ఉన్నతికి తన జీవితాన్ని అకింతం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.ఆ మహనీయునికి ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో కేయూ రీసర్చ్ స్కాలర్స్ తాళ్లపెళ్లి నరేష్, యం.డి పాషా, కేతపాక ప్రసాద్, కందికొండ తిరుపతి, బొచ్చు తిరుపతి, జనగాం రాజారాం, నాగరాజ్, మారుతి, మర్రి మహేష్, దూడపాక అశోక్, గణేష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.