1 June, 2026 | 1:00 PM

Breaking News

Formula-E race case ఈ- కార్ ఫార్ములా కేసులో త్వరలో ట్రయల్: సీఐడీ చీఫ్   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు   •   మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ   •   డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చలో కలెక్టరేట్ పాదయాత్ర ప్రారంభం   •   ఉరుమడ్ల గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలు   •   అగ్నివీర్ కు ఎంపికైన అచ్చంపేట యువకుడు   •   World Milk Day: పాల ధర తగ్గి, ఖర్చులు పెరిగి డైరీ రైతులు నష్టాల్లో   •   ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •  

పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎంపీ డా. కడియం కావ్య

11-04-2026 07:50 PM

* పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు

* మహిళల అభివృద్ధికి పూలే సేవలు చిరస్మరణీయం

* విద్యా విస్తరణకు మార్గదర్శకుడు జ్యోతిరావు పూలే

హనుమకొండ,(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. పూలే 200వ జయంతి సందర్భంగా ములుగు క్రాస్ రోడ్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ జ్యోతిరావు పూలే మహిళల అభివృద్ధి కోసం విశేష కృషి చేశారని, విద్యకు ప్రాధాన్యతనిస్తూ సమాజంలో కొత్త మార్గాలను చూపించిన మహనీయుడని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్య శారద,చాహాత్ బాజ్ పాయి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, బీసీ సంఘం నాయకులు రమేష్ గౌడ్, చిర్ర రాజ్ గౌడ్, టిఆర్పి జిల్లా నాయకులు కొమురయ్య తదితరులు పాల్గొని మహాత్మా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల ఆదనవు కలెక్టర్లు రవి, వై వి గణేష్, సంధ్యారాణి, డిబిసిడివోలు పుష్పలత, నర్సింహ,జిల్లా అధికారులు, బిసి సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.