calender_icon.png 14 November, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పే జూబ్లీహిల్స్ విజయం

14-11-2025 03:51:46 PM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్

మర్పల్లి, (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పే జూబ్లీహిల్స్ విజయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల సురేష్ యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు తో కలిసి టపాకాయలు కాల్చి మిఠాయిలు ఒకరికొకరు తినిపించుకున్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుతో బిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత బట్టబయలు అయిందని ఇకనుండి అయిన అసత్య ఆరోపణలు మానేసి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వికారాబాద్ నియోజకవర్గం  ఎమ్మెల్యే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి నేతృత్వంలో పాలన సాఫీగా సాగుతుందని  రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదేవిధంగా ప్రజలు టిఆర్ఎస్ పార్టీనీ సమాధి చేయడం ఖాయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు రవీందర్, బీసీ సెల్ ప్రెసిడెంట్ సర్వేశ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సలీం, వడ్ల వెంకటేశం, శేఖర్ యాదవ్, దివాకర్, నర్సింలు యాదవ్, శ్రీనివాస్ రెడ్డి,పాండు నాయక్, గోపాల్ నాయక్, తక్కలి శేఖర్, మన్నె సురేష్, ధరమ్ సింగ్, వినోద్ శర్మ, మహేష్, ముజ్జు, భరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు