11 April, 2026 | 6:19 PM

విద్యా విప్లవానికి నాంది..

11-04-2026 04:37 PM

- ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు

- జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్,(విజయక్రాంతి): ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం అని, మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా విప్లవానికి నాంది పలికిన ఆయన మహిళల విద్యకు ప్రాధాన్యతనిస్తూ తొలి బాలికల పాఠశాలను స్థాపించారని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో అదరపు కలెక్టర్ నగేష్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ నరేష్ , వివిధ కుల సంఘాల నాయకులలతో కలిసి కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి శ్రమించి, అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపట్టారు. దేశంలోని అణగారిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం కోసం చేసిన కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం ప్రస్తుత ప్రభుత్వానికి మార్గదర్శకమని అన్నారు. అంతకుముందు వివిధ కుల సంఘాల నాయకులు జ్యోతిబాపూలే గొప్పదనాన్ని వివరిస్తూ వక్తలు తమ సందేశాన్ని విన్నవించారు.

ఈ కార్యక్రమంలో సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి గంగా కిషన్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు దొంతి నరేందర్, కార్యదర్శి రాజ్ కుమార్, పద్మశాలి సంఘం అధ్యక్షులు మేకల జయరాములు, నాయని బ్రాహ్మణి సంఘం అధ్యక్షులు శ్రీ ఉప్పల స్వామి, మాల మహానాడు గౌరవ అధ్యక్షులు మాసాయిపేట మల్లేశం, బి సంగమేశ్వర్ సంబంధిత ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.