calender_icon.png 15 November, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టిన జూబ్లీహిల్స్ ఓటర్లు

15-11-2025 08:50:28 AM

కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎడ్ల సైదులు  

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించి పట్టంకట్టారని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఎడ్ల సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు,మాజీ డీసీసీబీచైర్మన్ బీరవోలు సోమిరెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యకర్తలందరూ సమిష్టిగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారని,పార్టీలకతీతంగా ఇంతటి మెజార్టీ ఇచ్చిన జూబ్లీహిల్స్ ఓటర్లందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.