calender_icon.png 15 November, 2025 | 10:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు

15-11-2025 08:52:05 AM

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. 

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): వరి కొనుగోలు ప్రక్రియలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు ఉంటాయని స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి(MLA Kuchukulla Rajesh Reddy) అన్నారు. శుక్రవారం మార్కెట్ యార్డ్‌లో మెఫ్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు.  రైతులకు న్యాయమైన మద్దతు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  అంతకుముందు బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో నిర్మితమైన ప్రభుత్వ పాఠశాల కొత్త భవనాన్ని  ప్రారంభించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మాజీ కౌన్సిలర్లు, డైరెక్టర్లు, వ్యవసాయ అధికారులు, రెవిన్యూ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.