calender_icon.png 6 December, 2024 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భుజంగరావు బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా

10-10-2024 12:28:18 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): ఫోన్‌ట్యాపిం గ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదు ఉంటున్న మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ నెల 16కు వాయిదా వేసింది. భు జంగరావుకు గతంలోనే 15 రోజుల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. కాగా, ఫోన్‌ట్యాపింగ్ కేసు లో భుజంగరావు ఏ2 గా ఉన్నారు.