16-02-2025 12:00:00 AM
ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా వృద్ధులు ఆనందంగా గడుపుతున్న వారి సంఖ్య భారతదేశంలో 22 శాతం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే కేవలం 10 శాతమే ఉంది. ఈ నిష్పత్తిని పరిశీలిస్తే మన దేశంలో కొంచెం మెరుగ్గానే ఉంది. అయితే ప్రస్తుతం మనదేశ వృద్ధులు 12 శాతం మంది మానసిక ఒత్తిడితో జీవిస్తున్నారు.
25 శాతం వృద్ధులు అనారోగ్య సమస్యలతోనూ, 8 శాతం మంది వృద్ధాశ్రమాల్లో వ్యక్తిగతంగా బతుకుతున్నారు. 36 శాతం వృద్ధులు పలు సమస్యలతో జీవితం వెళ్లదీస్తున్నారు. అయితే వృద్ధాప్యంలో హాయిగా జీవించడానికి పిల్లల ప్రేమ ఎంతో ముఖ్యమని పలు సర్వేలు చెప్తున్నాయి.
యాంత్రిక జీవనంలో ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయాయి. దీంతో ప్రేమానుబంధాలు పలుచబడుతున్నాయి. వృత్తి, ఉద్యోగాల బిజీతో వృద్ధాప్యంలోని తల్లిదండ్రులతో మాట్లాడే తీరిక దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యం ఒంటరితనాన్ని చవిచూస్తోంది. ఎక్కడైతే వృద్ధులను ఆప్యాయంగా చూసుకుంటున్నారో వారు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నట్లు అధ్యయనాల్లో తేలింది.