25 July, 2026 | 3:53 AM

జస్ట్ వెయిట్ అండ్ సీ

04-06-2024 03:10 AM
  • ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై సోనియా గాంధీ

ఫలితాలు భిన్నంగా ఉంటాయని వ్యాఖ్య

ఇండియా కూటమిదే విజయమని ధీమా

న్యూఢిల్లీ, జూన్ 3: కాంగ్రెస్ అగ్రనేత సోని యా గాంధీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై తనదైన శైలిలో స్పందించారు. సోమవారం ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిట్ పోల్స్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి విరుద్ధంగా ఉంటాయని, తమకు మెరుగైన ఫలితాలు వస్తాయని, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశాయి.

‘జస్ట్ వెయిట్ అండ్ సీ’ ఫలితాలు వచ్చే వర కు వేచి చూడాలని, ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా ఉంటాయని పునరుద్ఘాటించారు. తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి కరుణానిధి శత జయంతి సం దర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందు కు సోమవారం ఢిల్లీలోని డీఎంకే కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సహా ఇండియా కూటమి నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

రాహుల్ గాంధీ సైతం డీఎంకే కార్యాలయానికి వెళ్లి కరుణానిధికి నివాళులర్పించారు. కాగా, ఆదివారం విడుదలైన ఎగ్జి ట్ పోల్స్‌లో మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. ఎన్డీఏ కూటమి 350 సీట్ల మధ్య గెలుచుకుంటుందని చెప్పాయి. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం ఎగ్జిట్ పోల్స్‌ను కొట్టిపారేస్తున్నారు. ఇండియా కూటమికి కనీసం 295 సీట్లు వస్తాయని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.