27 April, 2026 | 7:26 AM

కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం

11-05-2024 12:05 AM

ఆరు గ్యారెంటీల్లో మహిళలకే పెద్దపీట

ఎన్నికల్లో గెలిపిస్తే సేవకురాలిగా పనిచేస్తా

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య

జయశంకర్ భూపాలపల్లి, మే 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలోనే అన్నివర్గాలకు న్యాయం సాధ్యమని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. భూపాలపల్లిలోని సుందరయ్యనగర్‌లో శుక్రవారం ఆమె గుడిసెవాసులతో సమావేశమయ్యారు. అనంతరం మండలంలోని ఘన్‌పూర్, చిట్యాల, టేకుమట్లలో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశాల్లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లో మహిళలకే పెద్దపీట వేసిందన్నారు.

కార్యకర్తలు కేంద్రంలో రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయా లని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెడితే పదేళ్లలో రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్ల అప్పు మిగిల్చిందన్నారు. ఎన్నికల్లో తన ను గెలిపిస్తే సేవకురాలిగా పనిచేస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, బీజేపీకి ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదన్నారు.

కాంగ్రెస్ కు మాత్రమే ప్రజాసంక్షేమంపై చిత్తశుద్ధి ఉందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నదని, రాహూల్ గాందీ ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలోనూ తెలంగాణదే పైచేయి అవుతుందన్నారు. ప్రచారంలో విస్లావత్ దేవన్, సాయన్న, దొమ్మటి సాంబయ్య, రాంనర్సింహారెడ్డి పాల్గొన్నారు.