ఇది అభివృద్ధికి.. ఆటంకానికి మధ్య ఎన్నిక
ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
మహబూబ్‌నగర్, మే 10 (విజయక్రాంతి): ప్రతి క్షణం అభివృద్ధి చేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒక వైపు, ఎలాగైనా అధికారం చేజిక్కించుకుని ఆటంకాలను సృష్టించాలని చూస్తున్న పార్టీ మరోవైపు నిలబడ్డాయని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో గౌడ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మాటపై నిలబడి ప్రజలకు సేవ చేసే పార్టీ అని స్పష్టంచేశారు. ప్రజలకు మయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి విస్మరించడం కాంగ్రెస్ నైజం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే చెప్పిన హామీలను అమలు చేస్తు అందరికీ ఆదర్శంగా ముందుకు సాగుతుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.






